Advertisementt

పాత టైటిల్ తో మరోసారి రజినీకాంత్!

Sun 26th Jul 2015 03:39 AM
rajinikanth,kaali,old tile,rajini kaali movie details,ranjit director  పాత టైటిల్ తో మరోసారి రజినీకాంత్!
పాత టైటిల్ తో మరోసారి రజినీకాంత్!
Advertisement
Ads by CJ

'కొచ్చాడయాన్‌,లింగ' వంటి భారీ డిజాస్టర్స్‌ తర్వాత రజనీకాంత్‌ ఎంతో ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. యువతరం దర్శకుడు రంజిత్‌ డైరెక్షన్‌లో ఆయన ఓ సినిమా చేయనున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి నిర్మితం కానున్న ఈ చిత్రానికి 'కాళి' అనే టైటిల్‌ పెట్టారని వార్తలు వస్తున్నాయి. కాగా 1980లో ఇదే టైటిల్‌తో రజనీ ఓ సినిమా చేశాడు. మరలా ఇన్నేళ్ల తర్వాత మరలా తన టైటిల్‌ను తానే పెట్టుకుని ఈ చిత్రం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్‌ ఆగష్టు 2న ప్రారంభం కానుంది. ఎక్కువ భాగం షూటింగ్‌ను మలేషియాలో జరుపనున్నారు. కాగా ఇందులో రాధికాఆప్టే హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. మరో విశేషం ఏమిటంటే...ఈ చిత్రంలో జెడిచక్రవర్తి విలన్‌గా కనిపించనుండగా, రజనీ వయసు మళ్లిన డాన్‌ పాత్రను పోషిస్తున్నాడు. ఇటీవలకాలంలో జెడి 'జోష్‌' చిత్రంలో విలన్‌గా నటించాడు. ఆ తర్వాత ఇప్పుడు మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న 'డైనమైట్‌'లో విలన్‌గా చేస్తున్నాడు. ఈ చిత్రానికి తమిళ మాతృక అయిన 'అరిమనంబి'లో కూడా ఆయన విలన్‌గా నటించాడు. తాజాగా ఆయనకు రజనీ సినిమాలో విలన్‌ క్యారెక్టర్‌ రావడం అంటే లక్కీ అనే చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ