‘బాహుబలి’ లాంటి ప్రతిష్టాత్మక చారిత్రాత్మక చిత్రంలో చిన్న పాత్ర అయినా చేయాలని చాలా మంది ఆర్టిస్టులు తహతహలాడారు. అలాంటి గొప్ప చిత్రంలో నటించాలని, ప్రభాస్ నటిస్తున్న సినిమాలో తాను కూడా నటించాలని..పభాస్ పెద్దనాన్న సీనియర్ నటుడు కృష్ణంరాజు కూడా అనుకున్నాడట. అయితే ఆయనకు తగ్గ పాత్ర లేకపోవడంతో కృష్ణంరాజు ‘బాహుబలి’లో నటించడం కుదరలేదు. చివరకు ప్రభాస్ కల్పించుకున్న రాజమౌళి నో చెప్పాడట. అయితే గుణశేఖర్ నిర్మిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి’లో కృష్ణంరాజు ‘గణపతి దేవుడి’గా కీలకపాత్రలో నటిస్తుండటం ప్రభాస్‌కు, రెబల్‌స్టార్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందట. అంతేకాదు రాజమౌళి చేయని ఫేవర్‌ను గుణశేఖర్ చేసినందుకు ఆయనపై అభిమానాన్ని పెంచుకున్నారట రెబల్‌స్టార్ అభిమానులు.