Advertisementt

బోయపాటి మీద భారం వేసిన ఏపీ..!!

Fri 24th Jul 2015 06:57 AM
pushkaralu,end,murali mohan,boyapai srinu  బోయపాటి మీద భారం వేసిన ఏపీ..!!
బోయపాటి మీద భారం వేసిన ఏపీ..!!
Advertisement

ఇరు తెలుగు రాష్ట్రాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పుష్కరాలు చివరి అంకానికి చేరుకున్నాయి. అందునా చంద్రబాబు ఈసారి పుష్కరాలకు కనీవిని ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు జరిగిన విపత్తును మినహాయిస్తే మిగిలిన సందర్భాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం జాగ్రత్తపడింది. ఇక పుష్కరాల ముగింపును కూడా అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏపీ పభ్రుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా భారీ ఎత్తున బాణాసంచా కాల్చడంతోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయనుంది. ఇక పుష్కరాల మహాఘట్టాన్ని తెరకెక్కించడానికి భారీ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను సాయాన్ని ప్రభుత్వం తీసుకుంటోంది.
పుష్కరాల ముగింపు ఘట్టాన్ని భారీ ఎత్తున నిర్వహించే బాధ్యతను ఎంపీ మురళీమోహన్‌, బోయపాటి శ్రీనులు తమ భుజాలపైకి తీసుకున్నారు. బోయపాటికి వేరే షెడ్యూల్‌ ఉన్నప్పటికీ ఈ కార్యకమ్రం కోసమే పత్య్రేకంగా పిలిపించినట్లు మురళీమోహన్‌ పేర్కొన్నారు. పుష్కరాల ముగింపు ఘట్టాన్ని వీక్షించడానికి రాజమండ్రి నగరంలో భారీ ఎత్తున బహిరంగంగా పెద్ద తెరల్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. లేజర్‌ షో, బాణాసంచాతోపాటు ఇతర కార్యక్రమాలను కూడా ప్లాన్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఇక పుష్కరాల ప్రారంభోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించాలన్న ఆతుత్రలో పభ్రుత్వం వేసిన తప్పటడుగుల కారణంగా దాదాపు 30 మంది ప్రాణాలొదిలారు. ఈసారి అలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని పజ్రలు కోరుకుంటున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement