Advertisementt

‘ది రేప్‌ ఆఫ్‌ అవంతిక’!

Fri 24th Jul 2015 06:48 AM
bahubali,avanthika,sivudu character,rajamouli,the rape of avanthika  ‘ది రేప్‌ ఆఫ్‌ అవంతిక’!
‘ది రేప్‌ ఆఫ్‌ అవంతిక’!
Advertisement

‘బాహుబలి’ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ సంచనాలు సృష్టిస్తూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇందులో యువతకు నచ్చిన రొమాంటిక్‌ సీన్‌ శివుడు, అవంతిక మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశం. ఆపై వచ్చే ‘పచ్చబొట్టు...’ సాంగ్‌. అయితే ఈ సీన్‌పై మహిళా జర్నలిస్ట్‌ అన్నా వెట్టికాడ్‌ రాసిన వ్యాసం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ‘ది రేప్‌ ఆఫ్‌ అవంతిక’ పేరుతో ప్రముఖ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసంలో ఆమె దర్శకుడు ఆ సీన్‌ని మలిచిన తీరును తప్పుబట్టింది. అవంతిక అనుమతి లేకుండా దొంగచాటుగా పచ్చబొట్టు వేయడం, అవంతిక అనుమతి లేకుండా ఆమె జుట్టు ముడి విప్పి, ఆమె వస్త్రాలు తొగించి అడవిలో దొరికే సహజరంగులతో ఆమెకు లిప్‌స్టిక్‌ అద్దడం, కాటుక పెట్టడంపై ఆమె విమర్శులు గుప్పించింది. శివుడు పాత్ర అవంతిక పాత్రతో పూర్తిగా తప్పుగా ప్రవర్తించింది.. బాహుబలి వంటి అద్భుతచిత్రంలో ఓ అపరిచితుడు ఓ అమ్మాయిని ఇలా చేసి, ఆమెను ముగ్గులోకి దించి ప్రేమలో పడేయడం చూస్తే యువతకు ఎలాంటి సందేశం ఇచ్చినట్లు అవుతుందని ఆమె తన వ్యాసంలో ప్రశ్నించింది. ఈ వ్యాసంలోని పాయింట్లను చదివిన కొందరు ఆలోచింపదగిందే  అంటుంటే... సినిమాను సినిమాలాగా చూడాలని, మరీ చిన్న విషయాన్ని బూతద్దంలో పెట్టి చూస్తున్నారు అని మరికొందరు అంటున్నారు. మొత్తానికి సంచలనం సృష్టిస్తున్న ‘ది రేప్‌ ఆఫ్‌ అవంతిక’ వ్యాసంపై రాజమౌళి అండ్‌ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి..!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement