అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన ‘అన్నమయ్య, శ్రీరామదాసు’ చిత్రాలు కనివినీ ఎరుగని రీతిలో విజయం సాదించాయి. ఈ రెండింటిలో అన్నమయ్య వేంకటేశ్వరస్వామి భక్తుడైతే, శ్రీరామదాసు శ్రీరాముని భక్తుడు. కానీ అదే సమయంలో నాగార్జున స్వయంగా భగవంతునిగా అంటే ‘షిరిడిసాయి’గా నటించిన చిత్రం మాత్రం పరాజయం పాలైంది. త్వరలో నాగార్జున మరో భక్తి రస చిత్రంలో అందునా మరలా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నాగ్ వేంకటేశ్వరస్వామిగా నటిస్తాడనే వార్తలు గతంలో వినిపించాయి. కానీ అది నిజం కాదని, నాగ్ దేవుడిగా చేయడం లేదని, మరోసారి భక్తుని పాత్రనే చేస్తున్నట్లు తెలుస్తోంది. పౌరాణికపాత్రల్లో ఎక్కువ భాగం మీసం లేనిపాత్రలే ఉంటాయి. కానీ నాగ్‌కు మీసాలు తీస్తే చూడటం కష్టం. కాబట్టి దేవుడి వేషాల జోలికి పోకుండా కేవలం భక్తునిగా నటిస్తేనే నాగ్‌కు కలిసి వస్తుందని అంటున్నారు. కాగా ప్రస్తుతం రచయిత భారవి ఈ చిత్రం స్క్రిప్ట్‌వర్క్‌లో బిజీగా ఉన్నాడట.