ఇటీవల జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌లో స్టేజీ మీద చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు వంటివారు ఉండగా, నిర్మాత బండ్ల గణేష్ స్టేజీ మీదకు వచ్చినప్పుడు తనకిష్టమైన మెగాస్టార్ చిరంజీవి పాదాలకు నమస్కారం చేశాడు. మిగిలిన వారికి నమస్కారం చేయకపోవడంతో స్టేజీపై ఉన్న బాలకృష్ణ, మోహన్‌బాబు వంటివారి అభిమానులు బండ్లగణేష్‌పై ఫైర్ అవుతున్నారు. పెడితే అందరి పాదాలకు నమస్కారం పెట్టాలని, అంతేగానీ ఒకరికి పెట్టి మరొకరికి పెట్టకపోవడం తప్పు అంటూ బండ్లగణేష్‌పై నిప్పులు చెరుగుతున్నారు. కానీ వారి విమర్శలకు దీటుగా గణేష్ ‘అందరికీ పాదాభివందనం చేస్తే అది అడుక్కోవడం అవుతుంది. నచ్చిన వారికి మాత్రమే చేస్తే దాన్ని అభిమానం అంటారు.. అని కౌంటర్ ఇచ్చాడు. సభామర్యాద విషయంలో అందరికీ పాదాభివందనం చేయాలని లేదు కదా! అందునా గణేష్ చెప్పిన దాంట్లో ఎంతో నిగూడార్ధం వుంది. లేనిపోని మర్యాద నటిస్తూ... పాదాభివందనాలు చేసి స్టేజీ పక్కకు వెళ్లి బూతులు తిట్టుకునే వారిని ఎందరినో చూస్తున్నాం. పైకి దొంగ వినయాలు నటిస్తూ.. ఆ తర్వాత అమ్మనా బూతులు తిట్టే వారు ఎందరో ఉన్నారు. అలా ఆత్మవంచన చేసుకోకుండా తనదైన శైలిలో తాను ఎవ్వరికీ భయపడకుండా కేవలం చిరుకు మాత్రమే బండ్లగణేష్ పాదాభివందనం చేయడం ఎలా తప్పవుతుంది? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.