Advertisementt

ఏ సర్టిఫికేట్‌ వస్తే ఏమి?

Fri 24th Jul 2015 12:33 AM
sreemanthudu,sensor certificate,clean u certificate  ఏ సర్టిఫికేట్‌ వస్తే ఏమి?
ఏ సర్టిఫికేట్‌ వస్తే ఏమి?
Advertisement

మహేష్‌బాబు హీరోగా శృతిహాసన్‌ హీరోయిన్‌గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శ్రీమంతుడు’. ఈ చిత్రాన్ని ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు  జరుగుతున్నాయి. ఈ చిత్రం ఈనెల 31న సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకోబోతోంది. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా ఇది ఉంటుందని నిర్మాతలు అంటున్నారు. అయితే ఈ చిత్రం యూనిట్‌ తమ సినిమాకు ఎలాంటి సర్టిఫికేట్‌ వస్తుంది అనే ఆసక్తిని చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఈమధ్య కాంలో టాలీవుడ్‌లో సెన్సార్‌ సర్టిఫికేట్‌ను బట్టి సినిమాలు ఆడే పరిస్థితులైతే లేవు. తమిళనాడులో అయితే క్లీన్‌ యు చిత్రానికి పన్నురాయితీ ఉంటుంది కాబట్టి అక్కడ క్లీన్‌ యు కోసం దర్శకనిర్మాతలు పోటీ పడుతుంటారు. అలాగే అచ్చమైన తమిళ టైటిల్‌ పెట్టిన చిత్రాలకు కూడా అక్కడ పన్నురాయితీ వర్తిస్తుంది. కానీ టాలీవుడ్‌లో అలాంటి ఆంక్షలు ఏమీ లేవు. పెద్దలకు మాత్రమే అనే ‘ఎ’ సర్టిఫికేట్‌ పొందే చిత్రాలు కూడా బాగా ఆడుతున్నాయి. క్లీన్‌ యు పొందే చిత్రాలు ప్రేక్షకులు లేక బోసిపోవడం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ‘శ్రీమంతుడు’ చిత్రానికి ఏలాంటి సర్టిఫికేట్‌ వచ్చినా కూడా దాని వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమీ లేకపోవడంతో ఎవ్వరూ అలాంటి సెన్సార్‌ రిపోర్ట్‌ కోసం ఎదురుచూడటం లేదని చెప్పవచ్చు!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement