పవన్‌కళ్యాణ్ విషయానికి వస్తే ఆయనను టాలీవుడ్ నెంబర్‌వన్‌గా ఆయన అభిమానులు బావిస్తారు. కానీ ఆయన మాత్రం హరీష్‌శంకర్, బాబి, డాలీ, వంటి డైరెక్టర్లతో ఎక్కువగా పని చేస్తుంటాడు. గత కొద్దికాలంగా ఆయన చేసిన దర్శకుల్లో త్రివిక్రమ్,పూరీ మాత్రమే చెప్పుకోదగిన డైరెక్టర్లు. భవిష్యత్తులో ఆయన చేయబోయే చిత్రాల లిస్ట్‌లో త్రివిక్రమ్ తప్ప మరో స్టార్ డైరెక్టర్ లేడు. ఇలా కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం మంచి విషయమే కానీ అసలు స్టార్‌డైరెక్టర్లు పవన్‌తో సినిమాపై ఎందుకు ఉత్సాహం చూపించడం లేదనేది ఓ ప్రశ్న. అదే మహేష్‌బాబు విషయానికి వస్తే ఆయనతో సినిమాలు చేయడానికి త్రివిక్రమ్, పూరీజగన్నాథ్, రాజమౌళి, వినాయక్, శ్రీనువైట్ల వంటి స్టార్‌డైరెక్టర్లందరూ ఆసక్తి చూపిస్తుంటారు. మరి మహేష్‌లోని ప్లస్ పాయింట్ ఏమిటి? పవన్‌లోని మైనస్ పాయింట్లు ఏమిటి? అనే ప్రశ్న ఉదయించకమానదు. సినిమా విషయంలో పవన్ తాను చెప్పిందే చేయాలని పట్టుబట్టడం, దర్శకత్వంలో జోక్యం చేసుకోవడం, అందరితో ముభావంగా ఉండటం. సినిమాలు ఎప్పుడు చేస్తాడో?ఎప్పుడు రిలీజ్ అవుతాయనే విషయంలో క్రమశిక్షణ లేకుండా ఉండటం వంటివి పవన్ మైనస్‌పాయింట్లుగా చెప్పుకుంటారు. అలాగే ఆయనతో మాట్లాడ్డానికే అందరూ భయపడే క్యారెక్టర్ ఆయనది కావడం... ఎప్పుడు ఏ మూడ్‌లో ఉంటాడో అర్థం కాని విషయం.. వంటివి కూడా ఆయనకున్న మైనస్ పాయింట్లుగా చెప్పుకోవాలి.