ప్రస్తుతం అక్కినేని వంశంలోని మూడోతరం హీరో అక్కినేని అఖిల్ హీరోగా తన తెరంగేట్రం చిత్రాన్ని వినాయక్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హీరో నితిన్ తండ్రి సుదాకర్‌రెడ్డి తమ శ్రేష్ఠ్ మూవీస్ బేనర్‌లో నిర్మిస్తున్నాడు. సాయేషా సైగల్ అనే కొత్త హీరోయిన్ ఈ చిత్రంలో ఆయనకు జోడీగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అదే క్రమంలో అఖిల్ తన తండ్రి నాగార్జున పుట్టినరోజు కానుకగా అంటే ఆగష్టు 29న తొలిటీజర్‌ను రిలీజ్ చేసి సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించనున్నారు. ఇక అదే పనిలో భాగంగా తన తాతయ్య స్వర్గీయ అక్కినేని నాగేశ్వరావును సైతం మర్చిపోకుండా ఆయన జయంతి అయిన సెప్టెంబర్ 20న ఈ చిత్రం ఆడియోను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఇలా తన కుటుంబసభ్యులందరిని వదిలిపెట్టకుండా బర్త్‌డే కానుకలు సిద్దం చేస్తున్నాడు. ఈ చిత్రానికి అనుప్‌రూబెన్స్‌తో పాటు తమన్ కలిసి సంగీతాన్ని అందిస్తుండం విశేషం.