ఆల్రెడీ మహేష్‌బాబుతో ఓ సినిమా చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై మహేష్ కూడా స్పందించాడు. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని, త్వరలో అధికార ప్రకటన వస్తుందని మహేష్ అంటున్నాడు. కాగా గతంలో రాజమౌళి మహేష్‌తో సినిమా చేయడానికి నేను సిద్దంగా ఉన్నాను. అయితే ఆ సినిమా సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ను రీమేక్ చేయాలా? లేక కృష్ణకు అద్భుతమైన ఇమేజ్‌ను తెచ్చిపెట్టిన ‘జేమ్స్‌బాండ్’ తరహా చిత్రమా? అనేది మహేష్, ఆయన అభిమానులే తేల్చుకోవాలని రాజమౌళి ఒకసారి చెప్పివున్నాడు. మొత్తానికి రాజమౌళి మహేష్‌తో తీసే చిత్రం మాత్రం అది ఏ జోనర్ చిత్రమైనా సరే ‘బాహుబలి’ని మించిన బడ్జెట్, హంగులతో రూపొందడం ఖాయంగా కనిపిస్తోంది. మరి జక్కన డైరెక్షన్‌లో మహేష్ నటించే చిత్రం ఏ కోవలో ఉండాలో అభిమానులు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.