‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత సరైన ప్లానింగ్ లేకపోవడంతో త్రివిక్రమ్‌కు అనుకోని గ్యాప్ వచ్చింది. దీంతో ఆయన ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రం చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. చివరకు నాగచైతన్యతో కానీ లేక నితిన్‌తో కానీ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. నిర్మాత రాధాకృష్ణ మాత్రం నాగచైతన్యను పెట్టుకోవాలని తెగ ప్రయత్నించాడు. కానీ చివరకు త్రివిక్రమ్ నితిన్ వైపే మొగ్గు చూపించాడు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉండటంతో ఆ పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తారా? అనే సందిగ్దత కొనసాగుతోంది. నితిన్ ఆల్‌రెడీ ఈ సినిమాకు సైన్ కూడా చేసేశాడని సమాచారం. అంతేకాదు.. త్రివిక్రమ్‌ను ఈ విషయంలో పవన్ సైతం ప్రభావితం చేశాడని తెలుస్తోంది. పవన్‌కు వీరాభిమాని అయిన నితిన్‌తోనే సినిమా చేయమని పవన్ సైతం సలహా ఇచ్చాడట. ఇన్ని రికమండేషన్ల మధ్య నితిన్ ఎంపిక జరిగిందని తెలుస్తోంది.