టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు అభిమానులకు ఇది అదిరిపోయే వార్త. మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొంది, ఆగష్టు 7న విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రంలో గ్రామ దత్తతతో పాటు పలు సందేశాలు ఉన్నాయని తెలుస్తోంది. దాంతో ఈ చిత్రాన్నితెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ప్రత్యేకంగా ప్రదర్శిస్తారని తెలుస్తోంది. ఊరిని దత్తత తీసుకోవడం అనే ఓ మంచి పాయింట్‌తో సాగే కథ ఇది అని సమాచారం. దానికి కమర్షియల్ హంగు జోడిరచారు. అందుకే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకే కాక దేశ ప్రదాని నరేంద్రమోడీకి సైతం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించాలని యూనిట్ భావిస్తోంది.విడుదలకు ముందు రోజు ఈ సినిమాని హైదరాబాద్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులకు స్పెషల్ షో ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇక చిత్రాన్ని చూడమని త్వరలోనే మోడీని చిత్రబృందం కోరే అవకాశాలున్నాయి. అంతేగాక ‘బాహుబలి’ చిత్రంలాగే ‘శ్రీమంతుడు’కు కూడా రెండు రాష్ట్రాల్లో మొదటి వారం రోజు టిక్కెట్ల రేట్ల పెంపుకోసం కూడా ఈ స్పెషల్‌షోను ఏర్పాటు చేశారని, ఆంద్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహేష్ బావ గల్లా జయదేవ్ ద్వారా చానెల్ ఏర్పాటు చేశారని, ఇక తెలంగాణా సీఎం కేసీఆర్‌కు మహేష్ తండ్రి కృష్ణ ఎలాగూ మద్దతుదారే కాబట్టి ఈ స్పెషల్ షోను ఏర్పాటు చేసి మచ్చిక చేసుకోవడానికే ఈ తతంగం అంతా అని కొంతమంది విశ్లేషిస్తున్నారు.