Advertisementt

బిగ్‌ బడ్జెట్‌ చిత్రంలో మహేష్‌బాబు!

Tue 21st Jul 2015 04:21 AM
mahesh babu,vinayak,big budget movie,100 crores project  బిగ్‌ బడ్జెట్‌ చిత్రంలో మహేష్‌బాబు!
బిగ్‌ బడ్జెట్‌ చిత్రంలో మహేష్‌బాబు!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, మాస్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రం ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా తెలియదు. అయితే వినాయక్‌తో పాటు మహేష్‌ కూడా ఈ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం గురించి మరోసారి వినాయక్‌ నోరు విప్పాడు. తాను మహేష్‌తో చేసే సినిమా మహేష్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బడ్జెట్‌ చిత్రంగా ఉంటుందని, దాదాపు 100కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుందని వినాయక్‌ భరోసా ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. మహేష్‌బాబుతో ఓ సినిమా ఉంటుంది. త్వరలోనే ఆయనకు ఓ కథ వినిపించనున్నాను. అదెలా ఉంటుందంటే 100కోట్ల బడ్జెట్‌తో ఉంటుంది. ఈ చిత్రం అదిరిపోయే రేంజ్‌లో ఉంటుంది.. అని అన్నాడు. మరి ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కిందంటే అది మహేష్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బడ్జెట్‌ చిత్రంగా  రికార్డులను తిరగరాయం ఖాయం అనేది మహేష్‌ ఫ్యాన్స్‌ మాట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ