ఆరు పదుల వయసులోనూ అమితాబ్ బాలీవుడ్‌లో రాజ్యమేలుతున్నారు. ప్రకటనలు, సినిమాల్లో యంగ్ హీరోస్‌తో పోటీపడి మరీ ఆయన సంపాదిస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ చానల్ యాడ్స్‌లో నటించడానికి ఆయన తీసుకుంటున్న రెమ్యూనరేషన్ వివాదాస్పదమైంది.
దూరదర్శన్ కిసాన్ చానల్ ప్రచార కార్యక్రమాల్లో నటించడానికి అమితాబ్ రూ. 6.31 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అమితాబ్ నటించే ప్రకటనలకు సంబంధించి ఒకరోజులో షూటింగ్ పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఏడాదిపాటు ఈ యాడ్స్‌ను ప్రసారం చేసుకోవడానికి కిసాన్‌చానల్‌కు హక్కు ఉంటుంది. అయితే కిసాన్ చానల్ మొత్తం బడ్జెట్ రూ. 45 కోట్లు కాగా అందులో అమితాబ్ ఒక్కరోజు షూటింగ్‌కే రూ. 6.31 కోట్లు చెల్లించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మొదట అజయ్‌దేవగణ్, సల్మాన్‌ల పేర్లను పరిగణలోకి తీసుకున్న అంతిమంగా కిసాన్ చానల్ యాజమాన్యం అమితాబ్‌వైపే మొగ్గుచూపింది. కాగా ఏమాత్రం లాభాల్లో లేని.. రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఓ చానల్ ప్రసార కార్యక్రమాలకు సంబంధించి అమితాబ్ పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.