వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ట్విట్టర్లలో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్శీ ట్వీట్స్ చేస్తూ ఉంటాడు. తాజాగా చిరంజీవి 150వ సినిమాను ‘బాహుబలి’తో లింకుపెడుతూ ట్వీట్ చేశాడు. త్వరలో చిరంజీవి 150వ సినిమా మొదలుకానున్న నేపథ్యంలో వర్మ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.. మెగాస్టార్ 150వ సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమా కావాలి. సినిమా మేకింగ్ విషయంలో మేకర్స్ ఎలాంటి తప్పిదాలు చేయకూడదు. అలా జరిగితే ఆ సినిమా ‘బాహుబలి’ కంటే తక్కువ సినిమా అవుతుంది. అది మెగా డిజప్పాయింట్‌కు దారి తీస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చిరంజీవి 150వ సినిమా సెకండ్ బిగ్గెస్ట్ సినిమా కాకూడదు. ఇది బిగ్గెస్ట్ సినిమాగా,‘బాహుబలి’ కంటే బిగ్గర్ సినిమా కావాలి. ఏడేళ్లుగా చిరంజీవి 150వ సినిమా కోసం అభిమానులు ఆకలితో ఎదరు చూస్తున్నారు. చిరంజీవి 150వ సినిమా బిగ్గెస్ట్ మూవీగా రూపొంది, ‘బాహుబలి’ కంటే పెద్ద హిట్ అయినప్పుడే అభిమానుల ఆకలి తీరుతుంది.. అని ట్వీట్ చేశాడు.