కొరటాశివ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా, శృతిహాసన్ హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ‘శ్రీమంతుడు’ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలోఉంది. ఆగష్టు 7న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించిన మహేష్‌బాబు ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థకు సంబంధించిన వ్యవహారాలను ఆయన భార్య నమ్రత స్వయంగా చూసుకొంటోందట. దీంతో సినిమా విషయంలో ఆమె జోక్యం ఎక్కువైందని, ముఖ్యంగా సినిమా బిజినెస్ విషయంలో ఆమె తీరు ఇబ్బందిగా మారిందని, ఆమె చెప్పే ధరలు చూసి బయ్యర్లు సినిమాను కొనేందుకు భయపడుతున్నారని ఫిల్మ్‌నగర్ టాక్.