రాజమౌళి తీసిన 'బాహుబలి' తెలుగు సినిమాకి కొత్త దారుల్ని వెదికిపెట్టింది. టాక్ యావరేజ్‌గానే వచ్చినా మార్కెట్ పరంగా మాత్రం ఎలా వసూళ్లు కొల్లగొట్టాలో 'బాహుబలి' సినిమా ఓ ఉదాహరణగా నిలిచింది. కేవలం అత్యధిక థియేటర్లలో విడుదల చేయడమే కాకుండా... ముందుగా సినిమాకి ఎలా హైప్ తీసుకురావాలో బాహుబలి బృందం చాటి చెప్పింది. తదుపరి రాబోతున్న చిత్రాలన్నీ అదే ప్లానింగ్స్‌తో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మహేష్ 'శ్రీమంతుడు', అనుష్క 'రుద్రమదేవి' చిత్రాలు 'బాహుబలి' మార్కెటింగ్ పద్ధతుల గురించి ఆరా తీస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు ఆయా సినిమాలకి హైప్ తీసుకురావడం కష్టం కాబట్టి... విడుదల, ప్రచారం విషయాల్లో బాహుబలి పద్ధతుల్ని అనుసరించే ప్రయత్నం మాత్రం గట్టిగా చేస్తున్నాయి. ముఖ్యంగా 'శ్రీమంతుడు' విషయంలో మహేష్ ఇప్పటికే పక్కాగా టార్గెట్ ఫిక్స్ చేశాడట. భారీగా థియేటర్లలో సినిమాని విడుదల చేయడం, బెన్‌ఫిట్ షోల ద్వారా తొలి రోజు భారీగా ఓపెనింగ్స్ రాబట్టుకోవడంపై దృష్టిపెట్టాలని మహేష్ సూచించాడట. 'బాహుబలి'లాగే చాలా చోట్ల బెన్ఫిట్ షోలు వేయడం కోసం ప్రభుత్వాల నుంచి అనుమతి కూడా తీసుకోబోతున్నట్టు తెలిసింది. బాహుబలికి తొలి రోజు రూః 24 కోట్లు వసూళ్లొచ్చాయి. ఆ మార్క్‌ని అందుకొనేలా 'శ్రీమంతుడు' చిత్రబృందం ప్రణాళికలు రచించిందట. ఈ నెల 18న పాటల వేడుక జరగబోతోంది. రోజుకో స్టిల్లుని విడుదల చేస్తూ శ్రీమంతుడుపై హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 'మిర్చి' ఫేమ్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.