అందాల భామ శ్రద్దాదాస్ టాలీవుడ్‌లో చెప్పుకోదగిన సినిమాలే చేసింది. గతంలో హిట్ సినిమాలలో నటించిన ఈ భామకు ఈమధ్య విజయం అనేది ఎరగలేదు. ఎన్నో ఆశలు పెట్టుకొన్న వైవిఎస్ చౌదరి ‘రేయ్’ సినిమాతో తిరిగి పూర్వవైభవం సంతరించుకోవచ్చని కలలు కన్న ఈ భామకి అది కలగానే మిగిలిపోయింది. తాజాగా ఆమె బాలీవుడ్‌లో ‘హంటింగ్ ఆఫ్ బోంబే మిల్స్’ చిత్రంతో పాటు తెలుగులో ప్రవీణ్‌సత్తారు దర్శకత్వం వహిస్తున్న ‘గుంటూరు టాకీస్’ చిత్రంలో కూడా మంచి పాత్రను పోషిస్తోంది. యదార్ధ సంఘటన నేపథ్యంలో తెరకెక్కనున్న ‘హంటింగ్ ఆఫ్ బోంబే మిల్స్’ చిత్రంలో ఆమె చాలెంజింగ్ రోల్ చేస్తోంది. ఈ చిత్రంలో ఆమె జర్నలిస్ట్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని హీరో కమ్ నిర్మాత సచిన్‌జోషి తెలుగులో సైతం తన సొంత బేనర్‌లో విడుదల చేయబోతున్నాడు.