Advertisementt

ఎన్టీఆర్‌, సుకుమార్‌ సినిమాలో ట్విస్ట్‌ ఇదే!

Thu 16th Jul 2015 06:07 AM
ntr,sukumar,rakul preeth singh,interpole officer role  ఎన్టీఆర్‌, సుకుమార్‌ సినిమాలో ట్విస్ట్‌ ఇదే!
ఎన్టీఆర్‌, సుకుమార్‌ సినిమాలో ట్విస్ట్‌ ఇదే!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్‌ లండన్ లో శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి ఎన్టీఆర్‌, హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌పై వచ్చే పాటలను చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ చిత్రం తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే రివేంజ్‌ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘మా నాన్న ప్రేమతో’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. అయితే ఈ కథలో ఓ అదిరిపోయే ట్విస్ట్‌ ఉందని సమాచారం. ఇందులో ఎన్టీఆర్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా కనపించనున్నాడు. ఇటీవల ఎన్టీఆర్‌ డిఫరెంట్‌ గెటప్‌లో ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఆ ఎపిసోడ్‌ ఎంతసేపు ఉంటుంది? కథలో ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంది? అనేది తెలియాల్సివుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ