Advertisementt

‘కంచె’కు విముక్తినిచ్చేది గాంధీనే!

Wed 15th Jul 2015 08:26 AM
varun tej,krish,kanche movie,october 2nd release  ‘కంచె’కు విముక్తినిచ్చేది గాంధీనే!
‘కంచె’కు విముక్తినిచ్చేది గాంధీనే!
Advertisement
Ads by CJ

‘ముకుంద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ రెండో సినిమా ‘కంచె’. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆయన తండ్రి జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఆమధ్య జార్జియాలో ఓ భారీ షెడ్యూల్‌ పూర్తి చేసుకొని వచ్చింది. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత ఆరంభమైన షెడ్యూల్‌ కూడా ముగిసింది. రీసెంట్‌గా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని సైతం వదిలారు. అది అందరి ప్రశంసలు పొందుతోంది. తాజాగా ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అది మరేదో కాదు.. ఈ చిత్రం విడుదల తేదీ. స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కథతో రూపొందే ఈ చిత్రం విడుదల తేదీని కూడా దేశభక్తికి చెందిన తేదీనే ఎంచుకోవాలని నిర్ణయించారు. ఆ తేదీ మరేదో కాదు.. అక్టోబర్‌ 2వ తేదీ. అంటే గాంధీ జయంతి రోజున ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. దేశభక్తి, ప్రేమ, స్నేహం వంటి విలువలతో కూడిన ఈ సందేశాత్మక చిత్రం బ్రిటిష్‌ వారికి, జమీందార్‌ వ్యవస్థకి వ్యతిరేకంగా సాగే పోరాటంతో ఈ చిత్రం కథ సాగనుంది..!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ