Advertisementt

‘గోపాల గోపాల’ బాటలో ‘బాహుబలి’!

Wed 15th Jul 2015 05:33 AM
bahubali satellite rights,rajamouli,sai korrapati  ‘గోపాల గోపాల’ బాటలో ‘బాహుబలి’!
‘గోపాల గోపాల’ బాటలో ‘బాహుబలి’!
Advertisement
Ads by CJ

‘బాహుబలి’ శాటిలైట్‌ రైట్స్‌ విషయంలో రోజుకో వార్త షికారు చేస్తోంది. వాస్తవానికి ఇప్పటికి కూడా ‘బాహుబలి’ శాటిలైట్‌ రైట్స్‌ అమ్ముడుకాలేదు. ఈ సినిమా విడుదలకు ముందు 12కోట్లకు కొంటామని కొన్ని చానెల్స్‌ ముందుకు వచ్చాయి. కానీ ‘బాహుబలి’ టీమ్‌ మాత్రం 15కోట్లకు తగ్గేది లేదని చెప్పింది. అంత పెట్టడం ఇష్టంలేని చానెల్స్‌ వెనకడుగు వేశాయి. ఈ తతంగం అంతా చూసిన రాజమౌళి సన్నిహిత మిత్రుడు సాయికొర్రపాటి మాత్రం 12కోట్లకు రైట్స్‌ అమ్మవద్దు. సినిమా విడుదలైన తర్వాత 18కోట్ల వరకు వస్తాయి. మీకు అభ్యంతరం లేకపోతే ఆ 15కోట్లు నేనిస్తాను. నాకే ‘బాహుబలి’ శాటిలైట్‌ రైట్స్‌ ఇవ్వమని రాజమౌళిని కోరాడట. అన్నట్లుగానే 15కోట్లు చెల్లించి శాటిలైట్‌ రైట్స్‌ను సాయి కొర్రపాటి తన చేతిలోకి తీసుకున్నాడు. ఈ విషయంలో కూడా సాయికొర్రపాటి ముందస్తు ఐడియాతోనే ‘బాహుబలి’  శాటిలైట్‌ కొన్నాడని తెలుస్తోంది. ఆయన నిర్మాతగా తెరకెక్కిన ‘తుంగభద్ర, దిక్కులు చూడకు రామయ్యా’ చిత్రాలు  ఇప్పటికీ శాటిలైట్‌ రైట్స్‌ అమ్ముడుపోలేదు. దాంతో ‘బాహుబలి’ని తీసుకొనే చానెల్‌ తాను నిర్మించిన ‘తుంగభద్ర, దిక్కులు చూడకు రామయ్యా’ను కూడా కలిసికట్టుగా ఓ ప్యాకేజీగా తీసుకోవాలని సాయి కొర్రపాటి తిరకాసు పెట్టడంతో మా, జెమినీ, జీ ఛానెల్స్ ప్రతినిధులు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారట.. గతంలో నిర్మాత సురేష్‌బాబు కూడా ‘గోపాల గోపాల’ విషయంలో ఇదే ఫార్ములాను అప్లై చేసిన సంగతి తెలిసిందే. అలా సురేష్‌బాబు ప్లే చేసిన టెక్నిక్‌ను ఇప్పుడు సాయికొర్రపాటి ప్రయోగిస్తున్నాడు. అయితే ఈ విషయం మాత్రం ఇంతవరకు అధికారికంగా బయటికి రాలేదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ