Advertisementt

బాహుబలి టైటిల్స్ లో దేవ కట్టా వెనుక విషయం!

Wed 15th Jul 2015 05:25 AM
rajamouli,bahubali,devakatta,prabhas,climax dialogues  బాహుబలి టైటిల్స్ లో దేవ కట్టా వెనుక విషయం!
బాహుబలి టైటిల్స్ లో దేవ కట్టా వెనుక విషయం!
Advertisement
Ads by CJ

‘బాహుబలి’ సినిమా టైటిల్స్‌ పడే సమయంలో దర్శకుడు దేవకట్టాకు థాంక్స్‌ చెబుతూ ఓ టైటిల్‌ కార్డ్‌ వేయించాడు రాజమౌళి. అసలు దేవకట్టాకు ‘బాహుబలి’కి సంబంధం ఏమిటి? అతని కోసం థాంక్స్‌ కార్డు ఎందుకు వేయించాడు అనేది చాలామందికి అర్థంకాలేదు. ఈ విషయమై దేవకట్టా విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం దేవకట్టా కొన్ని డైలాగ్స్‌ రాసిచ్చాడట. సినిమా క్లైమాక్స్‌లో ప్రభాస్‌ చెప్పే డైలాగు ఈయనే రాసాడట. ‘బాహుబలి’ కోసం దేవకట్టా కాంట్రిబ్యూషన్‌ చిన్నదే అయినా రాజమౌళి ఆయన్ను మరిచిపోలేదు. అందుకే ఆయనకు క్రెడిట్‌ ఇస్తూ థాంక్స్‌ కార్డు వేయించాడు రాజమౌళి. దీనిపై దేవకట్టా సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశాడు. ‘బాహుబలి’ వార్‌ సమయంలో ప్రభాస్‌ చెప్పే స్పీచులో కేవం కొన్ని పదాలు మాత్రమే నేను రాశాను. రాజమౌళి సృష్టించిన ‘బాహుబలి’ సముద్రంలో నేను చేసింది నీటి చుక్క మాత్రమే. అంత మాత్రానికే రాజమౌళి నాకు థాంక్స్‌ కార్డ్‌ వేయించాడు. అది రాజమౌళి గొప్పతనం... అంటూ దేవకట్టా ట్వీట్‌ చేశాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ