Advertisementt

ఎక్కువ సమయం తీసుకోనంటున్న రాజమౌళి!

Wed 15th Jul 2015 03:40 AM
rajamouli,bahubali the conclusion,prabhas,rana  ఎక్కువ సమయం తీసుకోనంటున్న రాజమౌళి!
ఎక్కువ సమయం తీసుకోనంటున్న రాజమౌళి!
Advertisement
Ads by CJ

'బాహుబలి' మొదటి భాగాన్ని విడుదల చేయడానికి రాజమౌళి మూడున్నర సంవత్సరాల సమయం తీసుకున్నాడు. ఎట్టకేలకు సినిమాను విడుదల చేసి భారీ వసూళ్లను సాధించాడు. అయితే ఈ చిత్రం కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ప్రేక్షకులలో మాత్రం సినిమా చూసిన తరువాత కాస్త నిరాశ ఏర్పడిందనే చెప్పాలి. తొలి పార్ట్ ను చూసిన ప్రేక్షకులలో ఇప్పుడు రెండవ రెండో భాగం ఎలా ఉండబోతోంది? దానికి కూడా రాజమౌళి మరో మూడేళ్ళ సమయం తీసుకుంటారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

అయితే ‘బాహుబలి` ది-కంక్లూజన్‌’ అనే టైటిల్‌ పెట్టిన ఈ రెండవ భాగాన్ని తెరకెక్కించడానికి ఏడాది సమయం చాలంటున్నాడు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర బృందానికి రాజమౌళి సందేశం పంపాడట. సుజిత్ దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్న ప్రభాస్ కూడా మరే సినిమా ఒప్పుకోకుండా 'బాహుబలి2' పైనే కాన్సన్ట్రేట్ చేయనున్నాడట. ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన ఈ చిత్రం మిగిలిన నలబై శాతం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోవడానికి ఏడాది సమయం సరిపోతుందని రాజమౌళి చెబుతున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ