శ్రమదోపిడీ కంటే మేథో దోపిడి ఇంకా చాలా అన్యాయమైనది. కానీ ఇలాంటి దోపిడీలు సినిమా రంగంలో ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక విషయానికి వస్తే రాజమౌళి ‘బాహుబలి’ విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచనాలు సృష్టిస్తూ, రాజమౌళి మీద, బాహుబలి టీం మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో సినిమా సూపర్ అంటున్నారు. ఆర్ట్ డైరెక్టర్ సాబుసిరిల్ పనితీరు అద్భుతం అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే బాహుబలి సినిమాకు పనిచేసిన మరో ఆర్ట్ డైరెక్టర్ మనుజగద్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. రాజమౌళి, బాహుబలి టీం తనను మోసం చేసినట్లు ఆయన ఫీలవుతున్నాడు. తనకు కనీసం టైటిల్ క్రెడిట్ కూడా ఇవ్వకపోవడంపై ఆవేదన చెందుతున్నాడు. ‘బాహుబలి’ సినిమాలో విజువల్స్ అంత గొప్పగా వచ్చాయంటే అందుకు కారణం సినిమా ఆర్ట్ డైరెక్టర్స్ వేసిన స్కెచ్చ్‌లే కారణం. ఈ స్కెచ్‌కు విజువల్ ఎఫెక్ట్స్ జోడించి తెరపై అద్భుతాలను చూపించారు. సినిమా విడుదలకు ముందు సదరు స్కెచ్చ్ లు ఇంటర్నెట్‌లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ సినిమాకు అసలైనే ఆర్ట్‌డైరెక్టర్‌ను తానే అని, బాహుబలి సినిమా కోసం వేసిన స్కెచ్చ్‌ల్లో అధికశాతం తాను వేసినవే అని...సాబుసిరిల్ కేవలం ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను కంట్రోల్ చేసే బాధ్యతలు మాత్రమే చూసుకున్నాడని మనుజగద్ అంటున్నారు. సినిమా ప్రమోషన్‌లో కూడా నా పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. కనీసం నాకు టైటిల్ క్రెడిట్ కూడా ఇవ్వకపోవడం దారుణం. నేను మోసపోయాను.. అంటూ మనుజగద్ వాపోతున్నాడు. ఇతని వ్యాఖ్యలపై రాజమౌళి ఎలా స్పందిస్తాడో వేచిచూడాల్సివుంది!