Advertisementt

మహేష్‌ కొత్త వ్యాపారం మొదలెట్టాడు!

Tue 14th Jul 2015 07:07 AM
mahesh babu,new business,galla jayadev,hyderabad sun risers team  మహేష్‌ కొత్త వ్యాపారం మొదలెట్టాడు!
మహేష్‌ కొత్త వ్యాపారం మొదలెట్టాడు!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఇప్పటివరకు సినిమాలు, వాణిజ్యప్రకటనలకే పరిమితం అయ్యాడు. తాజాగా ఆయన మరో కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు సమాచారం. త్వరలో ఆయన క్రీడారంగానికి సంబంధించిన వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా భారత్‌లో అత్యంత ఆదరణ పొందిన క్రికెట్‌కు సంబంధించిన వ్యాపారంలోకి అని సమాచారం. ఆయన ఐపీఎల్‌ టీమ్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ విషయమై తన బావ, గుంటూరు ఎంపీ గల్లాజయదేవ్‌తో ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఇప్పుడు రెండుగా విడిపోవడంతో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ టీమ్‌ తెలంగాణా టీమ్‌ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో కూడా ఓ ఫ్రాంచైజీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఐపీఎల్‌ నిర్వాహకులు ఉన్నారట. దీనికి వైజాగ్‌ సిక్సర్స్‌ అనే పేరు పరిశీలనలో ఉంది. 2017లో ఈ టీమ్‌ ఐపీఎల్‌లోకి ఎంటర్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలో మహేష్‌బాబు నుండి ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని టాక్‌. మహేష్‌బాబుకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బాగా ఉండటంతో ఐపిఎల్‌ టీం కొనుగోలు బాగా వర్కౌట్‌ అవుతుందని అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ