Advertisementt

రజనీ ఫ్యాన్స్ కు మంచి రోజు రాబోతోంది!

Tue 14th Jul 2015 07:06 AM
rajinikanth,kocchadayan,linga,director ranjith  రజనీ ఫ్యాన్స్ కు మంచి రోజు రాబోతోంది!
రజనీ ఫ్యాన్స్ కు మంచి రోజు రాబోతోంది!
Advertisement
Ads by CJ

ఆగష్టు 2వ తేదీన రజనీకాంత్‌ ఫ్యాన్స్‌కు పండుగ తేదీ కానుంది. ఆయన కొత్త చిత్రం ఆరోజున ఓపెన్‌ అవుతుంది. గతకొద్దిరోజులుగా రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ చూస్తున్న ఎదురుచూపులకు టైం వచ్చింది. అయితే ఆయన అభిమానులకు అనేక సందేహాలు ఉన్నాయి.  తమ సూపర్‌స్టార్‌ ఎప్పుడెప్పుడు  నటిస్తాడు? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  దానికి తోడు రీసెంట్‌ చిత్రాలు  ‘కొచ్చాడయాన్‌, లింగ’ అంచనాలు  తల్లకిందులు చేసి డిజాస్టర్స్‌ కావడంతో తదుపరి చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవ్వరూ ఊహించని విధంగా ఆయన కొత్త దర్శకుడు రంజిత్‌కు అవకాశమిచ్చారు. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతోంది? టైటిల్‌ ఏమిటి? ఎవరెవరు నటించనున్నారు? రంజిత్‌ శైలిలో ఈ చిత్రం ఓ వాస్తవిక చిత్రంగా రూపొందనుందా? లేక పక్కా కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కుతుందా? అంటూ రకరకాల   ఆలోచనల్లో పడ్డారు అభిమానులు. వీటన్నింటికి తెరదించుతూ సూపర్‌స్టార్‌ కొత్త చిత్రానికి ఆగష్టు 2వ తేదీన కొబ్బరికాయ కొట్టనున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ