Advertisementt

‘బాహుబలి’ సెకండ్‌పార్ట్‌ విశేషాలు!

Tue 14th Jul 2015 06:10 AM
bahubali part2,bahubali the conclusion rajamouli,fight sequences  ‘బాహుబలి’ సెకండ్‌పార్ట్‌ విశేషాలు!
‘బాహుబలి’ సెకండ్‌పార్ట్‌ విశేషాలు!
Advertisement
Ads by CJ

‘బాహుబలి’ రెండో భాగం ఎలా ఉండబోతోంది? అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ఆసక్తికర అంశం. ఈ చిత్రానికి ‘బాహుబలి`ది కంక్లూజన్‌’ అనే టైటిల్‌ పెట్టారు. ఈ చిత్రం మొదటి భాగంలోని సందేహాలకు అన్నింటికి కంక్లూజన్‌ ఇవ్వనుంది కాబట్టి దీనికి ఆ టైటిల్‌ పర్‌ఫెక్ట్‌గా యాప్ట్‌ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి2’ గురించి రానా మాట్లాడుతూ.... ‘బాహుబలి`ది కంక్లూజన్‌’ వచ్చాక ‘బాహుబలి`ది బిగినింగ్‌’ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. రెండో భాగంలో పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలు, సెట్స్‌.. వంటివి అన్ని ఇంకా భారీగా ఉంటాయి అంటున్నాడు. మొత్తానికి తనదైన భావోద్వేగాలను రాజమౌళి రెండో భాగంలో చూపించి తన తడాఖా నిరూపించుకోనున్నాడని, మొదటిభాగంపై వచ్చిన విమర్శలకు తన చిత్రం రెండోభాగమే సమాధానంగా నిలుస్తుందని సినీవర్గాలు అంటున్నాయి.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ