కొంతకాలం ముందు క్రియేటివ్ జీనియస్ మణిరత్నం మహేష్‌బాబు, నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాను తీయాలని భావించాడు. ఆ చిత్రం స్టోరీ నాగార్జునకు బాగా నచ్చినప్పటికీ, మహేష్ కూడా బాగుందని చెప్పినప్పటికీ చివరి నిమిషంలో మహేష్ ఆ సినిమా చేయనని చెప్పి హ్యండ్ ఇచ్చేశాడు. దాంతో ఆ చిత్రం కోసం తయారు చేసుకున్న స్టోరీ, స్క్రిప్ట్‌ను పక్కన పెట్టేసిన మణిరత్నం ‘ఓకే కన్మణి’ చిత్రం తీశాడు. రీసెంట్ గా.. త్వరలో మణిరత్నం తన దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ లో పనిచేసిన కార్తి హీరోగా ఓ చిత్రం చేయనున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం స్టోరీ నాగ్-మహేష్ కోసం తయారుచేసుకున్న సబ్జెక్టే అని కోలీవుడ్ సమాచారం. మహేష్ కోసం తయారు చేసిన పాత్రకు కొన్ని మెరుగులు దిద్ది దాన్ని కార్తీతో చేయిస్తున్నాడని, ఇక నాగార్జున పాత్రకు మార్పు చేర్పు చేసి మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టితో చేయించనున్నాడని సమాచారం. మరి ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తే.. అందరి కంటే ఎక్కువ బాధ పడేది మహేష్‌బాబునే అనేది వాస్తవం!