ఇటీవలే పవన్‌కళ్యాణ్ నటించనున్న‘గబ్బర్‌సింగ్2’ చిత్రం షూటింగ్ మొదలైంది. దాంతో పవన్‌కళ్యాణ్ అభిమానులందరూ ఎంతో ఆనందపడ్డారు. మొదటిషెడ్యూల్‌ను కనీసం వారం కూడా జరపలేదు. అందులో పవన్‌కళ్యాణ్ ఇంకా షూటింగ్‌లో జాయిన్ కాలేదు. త్వరలో ప్రారంభమయ్యే సెకండ్ షెడ్యూల్‌లో పవన్ పాల్గొంటాడని వార్తలు వచ్చాయి. సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే సన్నివేశాల కోసమే పవన్ గడ్డం పెంచాడని అనుకొన్నారు. కానీ పవన్ మాత్రం ఇప్పటికీ ఈ సినిమాపై నోరు మెదపలేదు. యూనిట్ నుండి కూడా సెకండ్ షెడ్యూల్ ఎప్పటినుండి ప్రారంభిస్తారో సమాచారం లేదు. పవన్ చూస్తే ప్రస్తుతం ఆయన ఆలోచనంతా రాజకీయాలపైనే ఉందని స్పష్టమవుతోంది. దీంతో పవన్ అభిమానులు నిరాశపడుతున్నారు. మరి ఈ చిత్రం ఎప్పుడు సెకండ్ షెడ్యూల్ ప్రారంభించుకుంటుందో కనీసం యూనిట్‌కు సంబంధించిన ఎవరో ఒకరు నోరు విప్పితేగానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.