Advertisementt

ఆ హీరోతో ఫొటోలు తీయించుకొన్న శ్రుతి..!

Mon 13th Jul 2015 07:51 AM
shruti hassan. ajith kumar,shruti hassan actres,ajith photography,   ఆ హీరోతో ఫొటోలు తీయించుకొన్న శ్రుతి..!
ఆ హీరోతో ఫొటోలు తీయించుకొన్న శ్రుతి..!
Advertisement
Ads by CJ
ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటో షూట్‌లు చేయించుకొని త‌మ అందాల్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు క‌థానాయిక‌లు. అందుకోసం ప్రొఫెష‌న‌ల్ ఫొటోగ్రాఫ‌ర్ల‌ని సంప్ర‌దిస్తుంటారు. అయితే శ్రుతిహాస‌న్ ఫొటో షూట్ మాత్రం ఓ హీరో చేశాడు. స్వ‌యంగా కెమెరా చేత‌ప‌ట్టుకొని శ్రుతి ఫొటోల్ని క్లిక్‌మ‌నిపించాడు.  ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంది క‌దూ...! ఇది నిజం. శ్రుతిహాస‌న్ ఫొటో షూట్ చేసిన ఆ హీరో ఎవ‌రో కాదు. ...అజిత్‌. త‌మిళంలో అజిత్ స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ ఓ చిత్రంలో న‌టిస్తోంది. శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ కోసం ఇటీవ‌ల ఇట‌లీ వెళ్లారు. అక్క‌డ శ్రుతి అందాన్ని చూసి అజిత్ స్వ‌యంగా ఫొటోగ్రాఫ‌ర్ అయిపోయాడ‌ట‌. కెమెరా చేత‌ప‌ట్టి ఆమె అందాల్ని త‌న కెమెరాలో బంధించాడ‌ట‌. ఆ త‌ర్వాత ఆ ఫొటోల్ని శ్రుతికి చూపించాడ‌ట‌. వాటిని చూసుకొని శ్రుతిహాస‌న్ ఎంతో ఆనంద‌ప‌డిపోయింద‌ట‌. వాటిని ట్విట్ట‌ర్‌లో అంద‌రితోనూ పంచుకొంది. అయితే ఏ ఫ్రొఫెష‌న‌ల్ ఫొటోగ్రాఫ‌రో ఆ స్టిల్స్ తీసుంటాడ‌ని అంతా ఊహించారు. కానీ ఆ త‌ర్వాత చిత్ర‌బృందం లోని కొద్దిమంది చెప్ప‌డంతో అవి  అజిత్ తీసిన ఫొటోల‌ని తెలిసింది. అజిత్ కేవ‌లం న‌టుడు మాత్ర‌మే కాదు. ఆయ‌న‌లో మంచి ఫొటోగ్రాఫ‌ర్ కూడా ఉన్నాడు. ఆ అనుభ‌వంతోనే శ్రుతిని అందంగా  ఫొటోలు తీశాడు. వాటిని మ‌ళ్లీ మ‌ళ్లీ చూసుకొని మురిసిపోతోంద‌ట శ్రుతి. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ