Advertisementt

అఖిల్‌ రెండో మూవీకి నాగ్‌ స్కెచ్ ఇదే!

Mon 13th Jul 2015 07:40 AM
akkineni akhil,nagarjuna,vv vinayak,srinu vytla,akhil second movie  అఖిల్‌ రెండో మూవీకి నాగ్‌ స్కెచ్ ఇదే!
అఖిల్‌ రెండో మూవీకి నాగ్‌ స్కెచ్ ఇదే!
Advertisement
Ads by CJ

నాగార్జున తన చిన్నకొడుకు అక్కినేని అఖిల్‌ డెబ్యూ మూవీని వినాయక్‌ చేతిలో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా అఖిల్‌కు మాస్‌ అండ్‌ యాక్షన్‌ హీరో ఇమేజ్‌ సంపాదించిపెట్టే పనిలో వినాయక్‌ బిజీగా ఉన్నాడు. దాంతో అఖిల్‌ను రెండో చిత్రం ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్‌ జోనర్‌లోకి తీసుకెళ్లాని నాగ్‌ ఆలోచనగా తెలుస్తోంది. ఇలాంటి చిత్రాలను తీయడంలో శ్రీనువైట్ల సిద్దహస్తుడు. ఈ విషయం నాగ్‌కు బాగా తెలుసు. నాగ్‌కు కూడా శ్రీనువైట్ల ‘కింగ్‌’తో మంచి విజయాన్ని అందించాడు. దాంతో శ్రీనువైట్ల టాలెంట్‌ ఏమిటో? ఆయన బలాబలాలు ఏమిటో నాగ్‌కు బాగా తెలుసు. అయితే శ్రీనువైట్ల.. కోనవెంకట్‌, గోపీమోహన్‌ నుండి విడిపోయిన తర్వాత ఆయనకు క్రేజ్‌ తగ్గింది. మొత్తానికి రామ్‌చరణ్‌ పుణ్యమా అని మరలా అందరూ ఒకటి కావడంతో మరలా శ్రీనువైట్లపై అందరికీ క్రేజ్‌ పెరిగింది. ఆ నమ్మకంతోనే అఖిల్‌ రెండో చిత్రాన్ని శ్రీనువైట్ల చేతిలో పెట్టాలని నాగ్‌ డిసైడ్‌ అయినట్లు సమాచారం. ఈమేరకు త్వరలో ప్రకటన రానుందని తెలుస్తోంది,. ప్రస్తుతానికి అఖిల్‌.. వినాయక్‌ సినిమాతో, శ్రీనువైట్ల.. రామ్‌చరణ్‌ సినిమాతో బిజిబిజీగా ఉన్నారు. మొత్తానికి సరైన నిర్ణయాలు తీసుకుంటూ అఖిల్‌ను తారాస్థాయికి చేర్చాలని తపన పడుతోన్న నాగ్‌ ఆశ నెరవేరాలని ఆశిద్దాం.!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ