Advertisement

రాజమౌళి నిజంగా విఫలమయ్యాడు!

Mon 13th Jul 2015 07:33 AM
ss rajamouli,bahubali,director,bahubali success  రాజమౌళి నిజంగా విఫలమయ్యాడు!
రాజమౌళి నిజంగా విఫలమయ్యాడు!
Advertisement

‘బాహుబలి’ చిత్రం విషయంలో దర్శకునిగా రాజమౌళి విఫలమయ్యాడా? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. దానికి కారణం కూడా హేతుబద్దంగానే ఉంది. వాస్తవానికి టాక్‌తో సంబంధం లేకుండా ‘బాహుబలి’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇది అక్షర సత్యం. కానీ రాజమౌళి ఈ  సినిమా విడుదలకు ముందు చేసిన వ్యాఖ్యలు ఏవో ఒక్కసారి చూద్దాం.. 'కలెక్షన్లు, రికార్డులు నేను పట్టించుకోను. అవి విజయానికి నిజమైన సూచికలు కావు. కేవలం క్రియేటివిటీ కోణంలో, సృజనాత్మకంగా ఉందనే ప్రశంసలు వస్తేనే నేను ఆనందిస్తాను. డైరెక్టర్‌గా నా స్థాయిని పెంచి విమర్శకుల ప్రశంసలు పొందితేనే నాలోని దర్శకుడు విజయం సాధించినట్లు భావిస్తాను' అని వ్యాఖ్యానించాడు. ఆ పరంగా చూస్తే ‘బాహుబలి’ కలెక్షన్లు ఎంత వచ్చినా రాజమౌళికి అది విజయం కాదని స్పష్టమవుతోంది. అంతేగాక దర్శకునిగా ఈ చిత్రంలో ఆయన తనదైన భావోద్వేగాలు, ప్రేక్షకులను కట్టి పడేసే కథ, కథనాల విషయంలో విఫలమయ్యాడు. సో.. రాజమౌళి ‘బాహుబలి’ని హిట్‌గా పరిగణిస్తాడా? లేక నిజాయితీగా తన తప్పిదాన్ని ఒప్పుకొంటాడా? లేదా? అనేది వేచిచూడాల్సిస అంశం!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement