ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ‘బాహుబలి’ గురించే హాట్‌టాపిక్. సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినా కలెక్షన్లు చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.దాదాపు 150 కోట్లకు పైగా వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం గురించి ప్రభాస్ దాదాపు మూడు సంవత్సరాలు కేటాయించాడు.అంతేకాదు ఈ చిత్రం కోసం మానసికంగా, శారీరకంగా ఎంతో కష్టపడ్డాడు ప్రభాస్. అయితే ఈ చిత్రం కోసం దర్శక నిర్మాతలు కోరితే రూపాయి తీసుకోకుండా నటించేవాడినని ఇంటర్వ్యూలో చెప్పిన ఈ యంగ్ రెబల్‌స్టార్ ‘బాహుబలి’ పార్ట్-1, పార్ట్-2 కోసం కలిపి ఏకమొత్తంలో 35కోట్ల పారితోషికాన్ని అందుకోనున్నాడు. అంటే దాదాపుగా ఒక్కో పార్ట్‌కు 17కోట్లకు పైనే ప్రభాస్ రెమ్యూనరేషన్‌గా నిర్ణయించారు. ‘బాహుబలి’ విడుదలకు ముందే ఇటీవల అందులో భాగంగానే ప్రభాస్‌కు 20కోట్ల మొత్తాన్ని నిర్మాతలు అందించారట.