Advertisementt

‘బాహుబలి’ జోరును తట్టుకోగలరా?

Sun 12th Jul 2015 01:07 PM
bahubali,manchu vishnu,dynamite movie,james bond movie  ‘బాహుబలి’ జోరును తట్టుకోగలరా?
‘బాహుబలి’ జోరును తట్టుకోగలరా?
Advertisement
Ads by CJ

మంచు విష్ణు హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తమిళ ‘అరిమనంబి’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రం ‘డైనమైట్‌’. ఈ చిత్రాన్ని ఎలాగైనా ఈనెల 24న విడుదల చేయాలని భావిస్తున్నారు. ‘బాహుబలి’కి భయపడేది లేదంటూ వారు ఈ డేట్‌ను ఫిక్స్‌ చేసుకున్నారు. మరోవంక అదే రోజు మారుతి ‘పాండవుల్లో ఒక్కడు’ కూడా రిలీజ్‌కు సిద్దమవుతోంది. మరోపక్క అల్లరి నరేష్‌ తన తాజా చిత్రం ‘జేమ్స్‌బాండ్‌’పై బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నాడు. ఆయన తన ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఈనెల 17న విడుదల చేస్తామని ప్రకటించారు కూడా. అయితే ‘బాహుబలి’ ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు కుమ్మేస్తుండటంతో ధైర్యం చేసి విడుదల చేస్తాడో? లేక మరో డేట్‌ చూసుకుంటారో వేచిచూడాల్సివుంది! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ