యువహీరో నాని గోవా వెళ్తున్నాడు. అదీ ఒంటరిగా కాదు.. లావణ్యత్రిపాఠితో కలిసి వెళ్తున్నాడు. వీరిద్దరూ వెళ్లేది టూర్‌కు కాదు.. కేవలం సినిమా షూటింగ్‌కు మాత్రమే. వీరిని గోవా తీసుకెళ్తున్నది డైరెక్టర్ మారుతి. మారుతి దర్శకత్వంలో గీతాఆర్ట్స్2, యువిక్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంలో బ్యాలెన్స్ ఉన్న పాటలను చిత్రీకరించేందుకు ఈ చిత్రం యూనిట్ గోవా వెళ్తోంది. ఈ పాటల చిత్రీకరణతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది. మరోపక్క ఎడిటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద చిత్రాల హడావుడి ముగిసిన తర్వాత అంటే ఆగష్టు చివరి వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం మాత్రం అటు నానికి, ఇటు మారుతికి ఇద్దరికీ జీవన్మరణ సమస్యగా మారిందంటున్నాయి సినీ వర్గాలు.