Advertisementt

మీడియాకు వీలైనంత దూరంగా రాజమౌళి!

Sun 12th Jul 2015 05:57 AM
rajamouli,keeravani,bahubali,rama rajamouli  మీడియాకు వీలైనంత దూరంగా రాజమౌళి!
మీడియాకు వీలైనంత దూరంగా రాజమౌళి!
Advertisement
Ads by CJ

ఇటీవల ‘బాహుబలి’ సినిమా విడుదలకు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమౌళి జర్నలిస్ట్‌తో గొడవ పడ్డ సంగతి తెలిసిందే. పైరసీ విషయంలో పాత్రికేయులు వేసిన ప్రశ్నలతో విభేదించిన రాజమౌళి ఓ క్రమంలో సహనం కోల్పోయాడు. అయితే అల్లు అరవింద్‌ కల్పించుకొని గొడవ సద్దుమణిగేలా చేశారు. ‘బాహుబలి’ సినిమా విడుదలైన సందర్బంగా శుక్రవారం ఉదయం కూకట్‌పల్లిలో సినిమా చూసేందుకు దర్శకుడు రాజమౌళి, హీరోయిన్‌ అనుష్క, ‘బాహుబలి’ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రమా రాజమౌళి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి తదితరులు వచ్చారు. సినిమా చూసిన అనంతరం మీడియా ప్రతినిధులు రాజమౌళి ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించారు. గత అనుభవం దృష్ట్యా మీడియాకు వీలైనంత దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆయన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఇప్పుడు నేనేమీ  మాట్లాడను అంటూ అందరికీ నమస్కారం పెట్టి అక్కడ నుండి వెళ్లిపోయారు. ‘బాహుబలి’ సినిమాకు మంచి టాక్‌ వచ్చిందని భావిస్తున్న ఆయన త్వరలో తన టీంతో కలిసి సక్సెస్‌మీట్‌ పెట్టి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ