Advertisementt

రామోజీ నుండి మరో నాలుగు చానెల్స్‌!

Sat 11th Jul 2015 08:18 AM
ramoji rao,four channels,reliance group,news channel  రామోజీ నుండి మరో నాలుగు చానెల్స్‌!
రామోజీ నుండి మరో నాలుగు చానెల్స్‌!
Advertisement
Ads by CJ

1995 ఆగష్టు 27న ప్రారంభమైన ఈటీవీ నెట్‌వర్క్‌ కాలక్రమేణ పదు సంఖ్యలో చానల్స్‌తో విస్తరించింది. తెలుగుతో పాటు ఇతరభాషల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ , న్యూస్‌ చానెల్స్‌ ప్రారంభించారు. అయితే ఇటీవల తెలుగు తప్ప ఇతర భాషల్లోని చానల్స్‌ను రిలయన్స్‌ గ్రూప్‌కు విక్రయించిన సంగతి తెలిసిందే. రామోజీ గ్రూప్‌ మళ్లీ సొంతంగా కొన్ని చానెల్స్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. రిలయన్స్‌తో సంబంధం లేకుండా ఇటీవలే ఒరియాలో న్యూస్‌ చానెల్‌ ప్రారంభించింది. తాజాగా ఇప్పుడు తెలుగులో ఒకేసారి నాలుగు చానెల్స్‌ను ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఆగష్టు 27న ఈటీవీ 20వ వార్షికోత్సవం సందర్బంగా వీటిని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ టీవీ ప్లస్‌, ఈటీవీ లైఫ్‌, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి చానెల్స్‌ను ప్రారంభిస్తున్నారని సమాచారం. ఈటీవీ ప్లస్‌లో పూర్తిగా యూత్‌ను టార్గెట్‌ చేసే కార్యక్రమాలు, ఈటీవీ లైఫ్‌లో ఫ్యామిలీ ఓరియంటెడ్‌తో కూడిన కుటుంబం, ఆరోగ్యం తదితర అంశాలతో, ఈటీవీ సినిమాలో పూర్తిగా సినిమా ప్రసారం, ఈటీవీ అభిరుచిలో వంట, హెల్తీఫుడ్స్‌ తదితర అంశాలతో సాగుతాయని తెలుస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ