>నటి స్వాతిరెడ్ది నటిగా మంచి టాలెంటెడ్. అందులోనూ చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఓ సినిమాలో ఆమె నటిస్తోంది అంటే ఆ చిత్రం సమ్‌థింగ్ స్పెషల్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆమె నటించిన చిత్రాలన్నీ మంచి విజయం సాదిస్తున్నాయి. దీనికి తోడు స్వాతికి తమిళ్, మలయాళంలో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఆమెతో తీసిన చిత్రాలను ఆడుతూ పాడుతూ మూడు భాషల్లో విడుదల చేసుకునే సౌకర్యం ఉండటంతో అది ఆమె సినిమాకు బాగా ప్లస్‌గా మారుతోంది. ప్రస్తుతం ఆమె ‘త్రిపుర’ అనే చిత్రంలో నటిస్తోంది. సాధారణంగా ఎక్స్‌పోజింగ్‌కు, గ్లామర్ విషయంలో ఆమె చాలా కఠినంగా ఉంటుంది. ఈ చిత్రంలో స్వాతి, నవీన్‌చంద్ర మధ్య ఓ లిప్‌లాక్ సీన్ డిమాండ్ చేయడంతో దానికి స్వాతి ఒప్పుకొంటుందా? లేదా? అని దర్శకనిర్మాతలు ఆలోచనలో పడ్డారట. అయితే సీన్ డిమాండ్ చేస్తోంది కాబట్టి స్వాతిరెడ్డి కూడా దానికి ఓకె చెప్పి ఆ ఘాటైన చుంభన దృశ్యంలో బాగా జీవించిందని టాక్. ఈ సీన్ సినిమాలో రసవత్తరంగా ఉంటుందని సమాచారం. ఏమైనా స్వాతిరెడ్డి తొలి సినిమా ముద్దు అందుకున్న నవీన్‌చంద్ర అదృష్టాన్ని చూసి చాలామంది ఈర్ష్యపడుతున్నారు!