>మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ మంచి ఊపుమీదున్నాడు. సాధారణంగా కొత్తగా హీరోలైన వారు ఆచితూచి అడుగులు వేస్తుంటారు. కానీ వరుణ్ మాత్రం వారికి భిన్నంగా ‘ముకుంద’ విడుదలైన వెంటనే ‘కంచె’ సినిమా పూర్తిచేశాడు. తాజాగా పూరీజగన్నాథ్‌తో ‘లోఫర్’ మొదలుపెట్టాడు. విషయానికి వస్తే ఈ చిత్రంతో వరుణ్‌తేజ్‌కు ‘సుప్రీంహీరో’ అనే బిరుదును తగిలించారు. అయినా బిరుదుదేముంది? సంపూ కూడా తన మొదటి చిత్రం ‘హృదయకాలేయం’తోనే బర్నింగ్ స్టార్ అని వేసుకున్నాడు. గతంలో మెగాస్టార్‌కు ముందు చిరంజీవికి సుప్రీం హీరో అనే బిరుదు ఉండేది. ఇప్పుడు సుప్రీం హీరో అనే బిరుదు ఖాళీగా ఉండటంతో వరుణ్‌తేజ్‌కు తగిలించారు. గతంలో ‘రేయ్’ విడుదల సమయంలో ఇదే బిరుదును మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌కు ఇవ్వాలని చూస్తే సాయి దానిని వద్దన్నాడు. చివరకు అది వరుణ్‌తేజ్ వద్దకు చేరింది. టైటిల్ కార్డ్స్ లో సుప్రీమ్ హీరో కి వరుణ్ ఛాన్స్ ఇస్తాడో లేదో తెలియాలంటే 'కంచె' రిలీజ్ వరకు ఆగాల్సిందే..!