>>ఆమధ్య ఇంకేముంది.. త్రిషకు పెళ్లయిపోతోందని అంతా అనుకున్నారు. కానీ ఏమయిందో ఏమో.. ఎవరి తప్పో తెలియదు కానీ వరుణ్‌మణియన్‌తో త్రిష ఎంగేజ్‌మెంట్ జరిగిన తర్వాత హఠాత్తుగా పెళ్లి క్యాన్సిల్ అయింది. దాంతో త్రిష నేనిప్పుడు సింగిల్‌గానే ఉన్నానంటూ అందరికీ చెబుతోంది. అయితే త్రిషకు మళ్లీ పెళ్లిపై మనసైందని కోలీవుడ్ వర్గాల సమాచారం. సాధారణంగా మీడియా ముందుకు ఎప్పుడు వచ్చినా పెళ్లి మాట ఎత్తకుండా తప్పించుకునే త్రిష ఈసారి మాత్రం తానే ఓ అడుగు ముందుకేసి త్వరలోనే పెళ్లి చేసుకుంటా.. పెళ్లి కొడుకును వెదికి చేసుకునే చాయిస్ నాదే. ఇక అంతా నా చేతిలోనే ఉంది. పెళ్లి అనేది ఖాయం. అయితే ఎప్పుడు? ఎవరితో? అనే ప్రశ్నలు ఇప్పుడే అడగొద్దు. మీరూ తొందరపడి ఏమీ రాయవద్దు.. నేనే చెబుతాను.. అంటూ మీడియాను రిక్వెస్ట్ చేసింది.