>ప్రతిష్టాత్మక బాహుబలి చిత్రం నైజాం రైట్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దిల్‌రాజు నైజాం హక్కుల కోసం 24కోట్లు చెల్లించాల్సివచ్చింది. 200కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తొలిరోజు తెలుగు వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా 22కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నైజాంలో తొలిరోజు 5కోట్లకు పైగా షేర్ వస్తుందని, ఒక్క హైదరాబాద్‌లోనే 3కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ‘బాహుబలి’ వసూళ్ల విషయంలో దక్షిణాది సినీచిత్ర సీమలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పబోతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.