మన దర్శక నిర్మాతలు, హీరోలు తమ చిత్రం బాగాలేదని చెప్పినా కూడా మా సినిమాకు ఇంత కలెక్షన్లు వచ్చాయి కాబట్టి అది హిట్టే అని వాదిస్తుంటారు. ఈ విషయంలో రాజమౌళిది విభిన్నమైన శైలి అని తెలుస్తోంది. ‘బాహుబలి’కి ప్రీ రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరిగింది. ఈ నేపథ్యంలో అందరూ ఈ సినిమా ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయి? మొత్తంగా ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుంది...? ఏయో రికార్డులను బద్దలు కొడుతుంది? వంటి లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేఫథ్యంలో రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ... సినిమా కలెక్షన్ల పరంగా ఎంత కలెక్ట్ చేసింది? అనే దానికంటే సినిమా క్రియేటివిటీ కోణంలో హిట్టయితే అదే నాకు ఆనందం అంటున్నాడు. తాము పడ్డ కష్టానికి గుర్తింపు లభిస్తే... ఘనవిజయం సాధించినట్లుగా భావిస్తానని చెబుతున్నాడు. బాక్సాఫీస్ అంకె కంటే సృజనాత్మక సంతృప్తికి మొదటి ప్రాధాన్యం ఇస్తానని ఆయన స్పష్టం చేశాడు. మరి ‘బాహుబలి’ ఆయన కోరికను ఎంతవరకు నెరవేర్చిందో అనేది తెలియాంటే కొన్ని గంటలు ఆగాలి మరి!