Advertisementt

అంజలిని ఆ నిర్మాతలు బెదిరించారట!!

Thu 09th Jul 2015 01:43 PM
anjali,anjali actress,problems to anjali,tamil movie producers  అంజలిని ఆ నిర్మాతలు బెదిరించారట!!
అంజలిని ఆ నిర్మాతలు బెదిరించారట!!
Advertisement
Ads by CJ
>రాజోలు పాప అంజలి చుట్టూ చుట్టుముట్టిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. సినిమా కంటే కాంట్రవర్శితోనే ఈ అమ్మడు పాపులర్‌ అయింది. ఈమధ్య కాస్త వాటిని పక్కనపెట్టి రిలీఫ్‌ అయింది. దాంతో సినిమాలతో కూడా బిజీ అయింది. తాజాగా ఆమె ఓ తమిళ చిత్రానికి కాల్షీట్స్‌ కేటాయించింది. అయితే అంజలి ఇచ్చిన డేట్స్‌లో చిత్ర బృందం షూటింగ్‌ చేసుకోలేకపోయింది. అందులో ఆమె తప్పులేదు. ఇప్పుడు మళ్లీ కాల్‌షీట్స్‌ ఇవ్వమని ఆ యూనిట్‌ అంజలిపై ఒత్తిడి తెస్తోంది. దీంతో ఇదేం గొడవరా బాబూ.. అంటూ అంజలి తలపట్టుకుంటోంది.  ''నేను డేట్స్‌ ఇచ్చినప్పుడు మీరు షూటింగ్‌ జరుపుకోలేదు. నన్నేం చేయమంటారు?'' అని అడుగుతోంది. అయితే ఆ చిత్ర నిర్మాతలు బాగా పలుకుబడి ఉన్నవారు కావడంతో వారు అంజలిని బెదిరిస్తున్నారట. దీంతో ఇంకెందుకులే అని అంజలి నేను చెన్నై వచ్చి షూటింగ్‌లో పాల్గొనలేను. కావాలంటే మీరే హైదరాబాద్‌ వచ్చి షూటింగ్‌ చేసుకోండి అని చెప్పిందట. ముందు ససేమిరా అన్నప్పటికీ తర్వాత సినిమా యూనిట్‌.. హైదరాబాద్‌లో షూటింగ్‌ జరపడానికి ఓకే అనడంతో సమస్య సద్దుమణిగింది.