ప్రస్తుతం అందరు బాహుబలి మేనియా లోనే ఉన్నారు. బాహుబలి తెలుగు సినిమాలలో గొప్పదంటూ... అందరూ రాజమౌళిని వారి బృందాన్ని తెగ పొగిడేస్తున్నారు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇదే మాట అంటున్నాడు. బాహుబలికి తన స్టైల్ లో విషెష్ చెబుతూ సోషల్ మీడియాలో స్పందించాడు. తెలుగులో బాహుబలి లాంటి భారీ చిత్రం రావడం చాలా గర్వంగా ఉందని చెప్పాడు.
ప్రభాస్, రానా, రాజమౌళిలపై ప్రసంశలు కురిపించాడు. ఈసినిమాతో ప్రభాస్, రానాలు తమ కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదుగుతారన్న నమ్మకం ఉందన్నాడు. ఇటీవలే చరణ్, మహేష్ బాబు, రేణుదేశాయ్ కూడా బాహుబలికి ఇలాంటి ప్రసంశలే ఇచ్చారు. ఇప్పుడు బన్నీ కూడా ఆ లిస్టులో చేరిపోయాడు. ఇలా అందరూ బాహుబలిని ఆశీర్వదిస్తే.. తెలుగు సినిమా చరిత్రలో ఎవరు ఊహించని రీతిలో వసూళ్లు సాధించడం ఖాయం.