తెలుగు ప్రేక్షకుల జేజెమ్మగా తమ మదిలో పదిలపరుచుకున్న స్టార్ హీరోయిన్ అనుష్క. ఆమె నటించిన ‘బాహుబలి’ చిత్రం ఈనెల 10న విడుదల కానుంది. ఇక ‘రుద్రమదేవి’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని రిలీజ్‌కు వెయిట్ చేస్తోంది. ఆమె నటిస్తున్న మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘సైజ్ జీరో’. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఆడియోను మనదేశంలో కాకుండా విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారు పివిపి సంస్థ వారు. ఆడియో లాంచ్‌ని మలేషియా లేదా సింగపూర్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలలోనే ఈ వేడుక జరుగనుంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రానికి విడుదల తేదీని అన్వేషిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నాడు.