Advertisementt

తనకిష్టమైన దర్శకునితో విలక్షణ నటుడు!

Thu 09th Jul 2015 05:06 AM
prakash raj,priyadarsan,kaanjeevaram,shreyareddy  తనకిష్టమైన దర్శకునితో విలక్షణ నటుడు!
తనకిష్టమైన దర్శకునితో విలక్షణ నటుడు!
Advertisement
Ads by CJ

ఎలాంటిపాత్రనైనా తన విలక్షణ నటనతో రక్తికట్టించగల నటుల్లో ఒకరు ప్రకాష్‌రాజ్‌. తాజాగా ఆయన తనకెంతో ఇష్టమైన ‘కాంజీవరం’ లాంటి సినిమాను తనకు అందించిన ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. కోలీవుడ్‌, బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న ప్రియదర్శన్‌ ప్రకాష్‌రాజ్‌తో చేయబోయే చిత్రాన్ని నాలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రం ఎయిడ్స్‌ రోగం చుట్టూ తిరుగుతుంది. సబ్జెక్ట్‌ సీరియస్‌దే అయినా తనదైన కామెడీ టచ్‌తో ఈ చిత్రాన్ని ప్రియదర్శన్‌ తెరకెక్కించి అందరినీ ఆలోచింపజేసే విధంగా తీయనున్నాడు. కాగా ఇందులో మరో కీలకపాత్రను శ్రేయారెడ్డి చేస్తోంది.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ