Advertisementt

ఒక పని పూర్తి చేసిన నాగ్‌!

Thu 09th Jul 2015 12:35 AM
nagarjuna,soggade chinni nayana,dosth movie,nagachaithanya,akhil  ఒక పని పూర్తి చేసిన నాగ్‌!
ఒక పని పూర్తి చేసిన నాగ్‌!
Advertisement
Ads by CJ
>ప్రస్తుతం సీనియర్‌ స్టార్‌ హీరో నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘దోస్త్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ‘మనం’ చిత్రం విడుదలై ఇంతకాలం అయినా ఆయన మరో చిత్రం విడుదల కాలేదని ఆయన అభిమానులు నిరాశగా ఉన్నారు. ఆ లోటు పూడ్చేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో   తన వయసుకు నప్పే పాత్రలు చేస్తున్న నాగ్,  రెండు విభిన్నపాత్రలను అందునా తాత, మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకొంది. ఈ చిత్రానికి ‘ఉయ్యాల జంపాల’ నిర్మాత రాధామోహన్‌ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా దర్శకునిగా కళ్యాణ్‌కృష్ణ అనే యువకుడు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా కొద్ది ప్యాచ్‌వర్క్ ల మినహా షూటింగ్‌ పూర్తిచేసుకొంది. సాదారణంగా నాగార్జునకు డిసెంబర్‌లో ఒక చిత్రం విడుదల చేయడం, అది విజయం సాధించడం ఆనవాయితీగా వస్తోంది. మరి ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం పూర్తికావడంతో కాస్త అఖిల్‌, నాగచైతన్య సినిమా రిలీజ్‌లను చూసుకొని సెప్టెంబర్‌లోనే తన సినిమాను థియేటర్లలోకి దించాలని నాగ్‌ భావిస్తున్నాడట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ