>మహేష్‌బాబు హీరోగా శృతిహాసన్ హీరోయిన్‌గా కొరటాల శివ దర్శకత్వంలో దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న చిత్రం ‘శ్రీమంతుడు’. ఈ చిత్రం ఆడియోను ఈ నెల 18న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు హైదరాబాద్‌లోని శ్పికళావేదిక వేదిక కానుంది. ఈ చిత్రంలోని ట్యూన్స్ దేవిశ్రీ కెరీర్‌లోనే ది బెస్ట్ అని చెబుతున్నారు. కాగా చిత్రాన్ని ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం థియేటికల్ ట్రైలర్‌ను కూడా ఆడియో వేడుకనాడే విడుదల చేయనున్నారు.