>మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం నుండి పూరీజగన్నాథ్‌ను తొలగించారని, ఆస్థానంలో వినాయక్‌ను పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తకు మరింత మసాలా అందించే విధంగా వార్తలు పుట్టుకొస్తున్నాయి. దర్శకుడిగా వినాయక్‌ను ఓకే చేసిన వెంటనే వినాయక్ చిరు పక్కన నటించే ఈ చిత్రంలోని ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేశాడని ఆ వార్త సారాంశం. మెయిన్ హీరోయిన్‌గా నయనతారను, మరో హీరోయిన్‌గా తమన్నాను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలోనే చిరంజీవి తనకు ఇప్పుడున్న హీరోయిన్లలో తమన్నా అంటే ఇష్టం అని తెలిపిన సంగతి తెలిసిందే. దాని ఆధారంగానే ఈ తాజా వార్తలు పుట్టుకొచ్చాయని అనిపిస్తోంది. తమన్నా ఆల్‌రెడీ రామ్‌చరణ్‌తో ‘రచ్చ’, అల్లు అర్జున్‌తో ‘బద్రినాథ్’ చిత్రంలో నటించింది. అలాంటి హీరోయిన్‌ను చిరు ఎందుకు అంగీకరిస్తాడు? అనేది అసలు పాయింట్ అంటున్నారు.