>మాజీ హీరోయిన్ లిజీ ఇప్పటికీ అందరికి గుర్తుండే ఉంటుంది. ‘సాక్షి, మగాడు, 20వ శతాబ్దం,ఆత్మబంధం’ వంటి చిత్రాలో నటించిన ఈ అమ్మడు 1991లో మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ను ప్రేమించి పెళ్లాడిరది. వీరికి కళ్యాణి, సిద్దార్థ్ లు సంతానం. కాగా ఇటీవ ఆమె తన భర్తతో విడాకులు తీసుకొంది. పాతికేళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న లిజి మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది. ఆమె మాట్లాడుతూ.. నటిగా కెరీర్ పీక్‌స్జేజీలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను. అయితే నా భర్త సినిమాల్లో నటించకూడదు అని కండీషన్ పెట్టడంతో ఇప్పటివరకు నటించలేదు. ఇప్పుడు నేను స్వేచ్ఛాజీవిని. అందుకే మరలా సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను. తల్లి పాత్రలు, ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో నదియా చేసినటు వంటి పాత్రలు చేయాలనుంది. ‘శ్రీమంతుడు’ చిత్రంలో జగపతిబాబుకు భార్యగా నటించమని అడిగారు. కానీ వీలు కాలేదు. ప్రస్తుతం రామ్ దర్శకత్వంలో తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను. అందులో 60ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడే 40ఏళ్ల మహిళపాత్ర నాది. చిరంజీవిగారి 150వ చిత్రంలో అవకాశం వస్తే అసలు వదులుకోను.. అని చెప్పుకొచ్చింది.